Tecno Camon 30 Premier Price: భారత మార్కెట్‌లో ప్రముఖ మొబైల్‌‌ కంపెనీ టెక్నో స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి ప్రజాధరణ లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తోంది. ఇటీవలే లాంచ్ చేసిన Tecno Camon 30 5G, Tecno Camon 30 ప్రీమియర్ 5G స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభంచింది. దీంతో చాలా మంది ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అలాగే కంపెనీ వీటిపై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ రెండు వేరియంట్స్‌ విభిన్న స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇవి 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12 GB ర్యామ్‌, 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు  తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్‌లో 8 GB ర్యామ్‌ కలిగిన వేరియంట్ ధర రూ. 22,999తో లభిస్తోంది. ఇక 12 GB ర్యామ్‌ వేరియంట్ రూ 26,999తో అందుబాటులో ఉంది. ఇక Camon 30 Premier స్మార్ట్‌ఫోన్‌ వివరాలల్లోకి వెళితే, ఇది 12 GB ర్యామ్‌, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆప్షన్స్‌లో వస్తోంది. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది మే 23 నుంచి అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్‌ను మొదటి సేల్‌లో కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  దీనిని కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, ఇతర బ్యాంక్‌ సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్‌ కూడా ఉచితంగా లభిస్తోంది.  



ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ Camon 30 Premier స్మార్ట్‌ఫోన్‌ 100MP OIS కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫ్రంట్‌ కెమెరా సెటప్‌లో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది  6.78 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Full HD+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌,  1200 నిట్‌ల బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. అలాగే Mali G610 GPUతో MediaTek Dimension 7200 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా 
50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా 
డ్యూయల్ LED ఫ్లాష్‌
డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌
5000mAh బ్యాటరీ 
70 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ 
బయోమెట్రిక్ భద్రత
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
డాల్బీ సౌండ్‌
Android 14 ఆధారంగా HiOS 14
MediaTek Dimension 8200 ప్రాసెసర్‌
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి