Tecno Phantom x2 Pro: Tecno Phantom X2 Pro 5G ఫోన్ అతి త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఇంకా ఈ ఫోనుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఫోన్ కు సంబంధించిన ఫ్రీ బుకింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన విక్రయాలు సౌదీ అరేబియాలో ప్రారంభం కాగా భారతదేశ మార్కెట్లోలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన అన్ని ఫీచర్ల వివరాలను వెల్లడించింది. హ్యాండ్‌సెట్‌లో 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ముడుచుకునే పోర్ట్రెయిట్ లెన్స్ ఉంది. అంతేకాకుండా 1.2-మైక్రాన్ కెమెరా సెన్సార్ ఉండబోతోంది. Tecno Phantom X2 Pro 5Gని ప్రీ-ఆర్డర్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల వినియోగదారులకు అమెజాన్ లో ఈ మొబైల్ కు సంబంధించిన ఫ్రీ బుకింగ్ ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం.


ఈ మొబైల్ ను ముందుగానే ఫ్రీ బుకింగ్ చేసుకుంటే రూ.5,000 తగ్గింపుతో పాటు 12 నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై 6 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ బుకింగ్ ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ కి ప్రీమియం బిజినెస్ గిఫ్ట్ బాక్స్ పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు చేసే 50వేల మంది కస్టమర్స్ కి లక్కీ డ్రా ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ లక్కీ డ్రా ద్వారా చాలా విలువైన వస్తువులను కూడా గెలుచుకోవచ్చు. 


Tecno Phantom X2 5G ఫీచర్లు:
 6.8-అంగుళాల పూర్తి-HD+ కర్వ్డ్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 
TUV SUD సర్టిఫికేషన్‌తో P3 వైడ్ కలర్ స్పెక్ట్రమ్ 
హ్యాండ్‌సెట్ 4nm MediaTek డైమెన్సిటీ 
LPDDR5 RAM, 256GB UFS 3.1
ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సెకండరీ 50-మెగాపిక్సెల్ సెన్సార్
32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5,160mAh బ్యాటరీ 
45W ఫాస్ట్ ఛార్జింగ్‌


Also Read: Body chopped: ఢిల్లీలో 3 ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యం.. టెర్రరిస్టు లింకుల కలకలం!


Also Read: Netflix Upcoming Telugu Movies: భోళా శంకర్ టు SSMB 28.. నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook