Tecno Spark 9 Pro Price Suddenly Down: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ టెక్నో (Tecno) నుంచి మార్కెట్‌లోకి విడుదలైన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అందుకే ఇటీవలే గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది. అయితే చాలా మంది గేమింగ్‌ మొబైల్స్‌ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి అంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌  కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.  ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లోని టెక్నో సేల్‌లో భాగంగా టెక్నో స్పార్క్ 9 మొబైల్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ ధర రూ.7,499 కాగా ప్రత్యేక ప్రత్యేక సేల్‌లో భాగంగా 9 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,799కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది అమెజాన్‌. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను అన్ని బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే దాదాపు రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇరత బ్యాంక్‌ క్రెడిట్‌లను వినియోగించి కూడా డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ. 6,000కే పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్మార్ట్‌ఫోన్‌  4GB ర్యామ్‌తో పాటు 7GB ర్యామ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో 7GB ర్యామ్‌ కలిగిన వేరియంట్‌పై మాత్రమే ఫ్లాట్‌ తగ్గింపు లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అమెజాన్‌ అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే దాదాపు  రూ. 5,500 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్‌ పోను కేవలం రూ. 500కే పొందవచ్చు. 


Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


Tecno Spark 9 స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌:
ప్రస్తుతం Tecno Spark 9 స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్స్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ 6.6 అంగుళాల HD+ డాట్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా  90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ MediaTek Helio G37 గేమింగ్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది Android 12 ఆధారంగా HiOS 8.6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీంతో పాటు 7GB ర్యామ్‌ 64జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది 13MP డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీతో డ్యూయల్ ఫ్లాష్‌లైట్‌ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 8MP ఫ్రంట్ కెమెరాను  కలిగి ఉంది.


Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter