COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tecno Spark Go 1 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ టెక్నో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ Spark Go 1 పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ Tecno Spark Go 1 మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌ సెప్టెంబర్‌ 3 నుంచి ప్రారంభమైంది. ఇది రూ.8000 కంటే తక్కువ ధరల్లోనే లభించబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మొబైల్‌ డబుల్‌ స్పీకర్‌ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రత్యేకమైన ఆఫర్స్‌ వివరాలు:
ఈ Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్‌ సంబంధించిన సేల్‌ 12 గంటల నుంచి అమెజాన్‌లో ప్రారంభం కాబోతోంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌  ధర రూ.7,299 నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు ఇది టెక్నో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా లభింస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ లైమ్ గ్రీన్, గ్లిట్టరీ వైట్‌తో పాటు  స్టార్‌ట్రైల్ బ్లాక్ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది.


Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌:
ఈ Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది Android 14 Go ఎడిషన్‌పై రన్ కాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది 6.67-అంగుళాల HD+ డిస్ప్లేతో లాంచ్‌ అయ్యింది. దీంతో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే 720x1,600 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. మొదటి సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ కేవలం 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రాబోతోంది. 


ఇతర ఫీచర్స్‌:
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
Unisoc T615 చిప్‌సెట్‌
డ్యూయల్ ఫ్లాష్‌
13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8-మెగాపిక్సెల్ కెమెరా
DTS సౌండ్‌ 
డ్యూయల్ స్పీకర్స్‌
IR కంట్రోల్‌ ఆప్షన్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5,000mAh బ్యాటరీ


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.