ఇండియాలో 35 వేల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లు ప్రాచుర్యం పొందాయి. ఇందులో Nothing Phone 1, Pixel 6a, OnePlus Nord 2T సహా ఇతర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఈ ఏడాది అంటే 2022లో టాప్ బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లుగా ప్రాచుర్యం పొందినవి 5 మోడల్స్ ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఫీచర్లతో పాటు..మిడ్ రేంజ్ డివైస్‌లో ప్రత్యేకత సంతరించుకున్నవి. వీటి ధర 35 వేలకంటే తక్కువ. ఫ్లాగ్‌షిప్ కెమేరా ఈ స్మార్ట్‌ఫోన్ల సొంతం. ఈ స్మార్ట్‌ఫోన్లు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..


Nothing Phone 1


ఈ ఏడాది అన్నింటికంటే స్టైలిష్ ఫోన్ Nothing Phone 1. ఇది చూడ్డానికే కాకుండా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌పరంగా కూడా అద్భుతమైన ఫోన్. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 32,999 రూపాయలుంది. ఇందులో స్మాప్‌డ్రాగన్ 778 జి చిప్‌సెట్ ఉంది. బ్యాటరీ కూడా అద్భుతమైన బ్యాకప్‌తో ఉంటుంది. 


Google Pixel 6a


పిక్సెల్ 6తో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 6ఏ అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్. ఇందులో 60 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఫ్లాగ్‌షిప్ కెమేరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ పోన్‌లో 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా ఉన్నాయి. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. ఈ ఫోన్ లో 4410 ఎంఏహెచ్ బ్యాటరీ మరో ప్రత్యేకత. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 29,999 రూపాయలుంది.


Xiaomi 11T Pro 5G Hyperphone


Xiaomi 11T Pro 5G Hyperphone చాలా పాపులర్ ఫోన్‌‌గా నిలిచింది. ఇందులో 120 వాట్స్ హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది. కేవలం 17 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అయిపోతుంది. ఇందులో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ కెమేరా ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 33,990 రూపాయలుగా ఉంది. 


iQOO Neo 6


iQOO Neo 6 కూడా మంచి మోడల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ భారీగా అమ్మకాలు సాగించింది. ఇందులో 6.2 ఇంచెస్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ కెమేరా, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేకతలు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 28,999 రూపాయలుగా ఉంది. 


OnePlus Nord 2T


OnePlus Nord 2T ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్. నార్డ్ 2 హిట్ అయిన తరువాత OnePlus Nord 2T కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమేరా, 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 28,999 రూపాయలుగా ఉంది. 


Also read: Best Mileage Bikes: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook