Top Mileage Scooters: పెట్రోల్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ...! ఇండియాలో టాప్ 5 బెస్ట్ స్కూటర్లు ఇవే..
Best Mileage Scooters: మీరు పెట్రోల్ తక్కువ తాగి.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ కోసం వెతుకుకుతున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే.
Top 5 Mileage Scooters in india: ప్రస్తుత రోజుల్లో బండి లేనిదే బయటకు వెళ్లడం లేదు. పెట్రోల్ ధరలు ఏమో ఆకాశాన్నింటుతున్నాయి. రేట్లు అమాంతం పెరగడంతో బైక్ తీయాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారీగా మైలేజ్ వచ్చే బైక్, స్కూటర్లు కోసం ప్రజలు అన్ లైన్ లో వెతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్రోల్ తాగి.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు గురించి తెలుసుకుందాం.
1. యమహా ఫాసినో హైబ్రిడ్ 125 (YAMAHA FASCINO HYBRID 125): ఇది 125cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తోపాటు హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. ఇది సుమారు 68 kmpl మైలేజీని ఇస్తుంది. ఇది 8.2PS/10.3Nm పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 76,600-87,830 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
2. యమహా రేజర్ 125 (YAMAHA RAYZR 125): ఇది స్పోర్టియర్ స్కూటర్. ఇది 125cc ఇంజిన్ కలిగి హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. ఇది కూడా సుమారు 68 kmpl మైలేజీని ఇస్తుంది. ఇది ఐదు వేరియంట్లలో లభ్యమవుతోంది. . దీని ధర రూ. 80,730-90,130 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
3. సుజుకి యాక్సెస్ 125 (SUZUKI ACCESS 125): ఇది 124cc, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది సుమారు 64 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 77,600-87,200 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు.
4. టీవీఎస్ జూపిటర్ (TVS JUPITER): ఇది ఇంటెల్లిగో ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో 110cc ఇంజన్‌తో నడుస్తోంది. ఇది సుమారుగా 62 kmpl మైలేజీని అందిస్తుంది. దీని ధర సుమారు 70-85 వేల రూపాయలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
5. హోండా యాక్టివా 6G (HONDA ACTIVA 6G): దీని ధర రూ. 73,086 నుండి రూ. 76,587 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 109.51cc, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది సుమారు 60 kmpl మైలేజీని అందిస్తుంది.
Also Read: Uber and Whatsapp: ఊబెర్ బుకింగ్ కోసం వాట్సప్ ఉంటే చాలు, యాప్ అవసరం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook