Uber and Whatsapp: ఊబెర్ బుకింగ్ కోసం వాట్సప్ ఉంటే చాలు, యాప్ అవసరం లేదు

Uber and Whatsapp: ఊబెర్ రైడ్ ఇకపై మరింత సులభం కానుంది. ఇక నుంచి ఊబెర్ బుక్ చేసేందుకు యాప్ అవసరం లేదు. వాట్సప్ ఉంటే చాలు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2022, 09:38 PM IST
Uber and Whatsapp: ఊబెర్ బుకింగ్ కోసం వాట్సప్ ఉంటే చాలు, యాప్ అవసరం లేదు

ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఉంటే చాలు..ఇప్పుడన్నీ సాధ్యమే. డిజిటల్ లావాదేవీలు కూడా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు అదనంగా మరో సేవ చేరింది. ఇక నుంచి ఊబెర్ కారును కూడా వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ప్రముఖ కార్ రైడింగ్ కంపెనీ ఊబెర్..వాట్సప్‌తో భాగస్వామ్యమైంది. ఫలితంగా ఊబెర్ రైడ్ వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఢిల్లీ, లక్నోల్లో అమలౌతున్న ఈ సేవలు త్వరలో దేశవ్యాప్తం కానున్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం ఇంగ్లీషు, హిందీ భాషల్లో రైడ్ బుక్ చేసుకునే వీలుంటుంది. అంటే ఇక ఊబెర్ రైడ్ బుకింగ్ కోసం యాప్ అవసరం లేదు. వాట్సప్ ద్వారా ఊబెర్ రైడ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం..

1. ముందుగా ఊబెర్ అధికారిక నెంబర్ +91 7292000002 కాంటాక్ట్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత చాట్ ద్వారా ఊబెర్ చాట్‌బాట్‌తో చాట్ చేయవచ్చు. ముందుగా హాయ్ అని మెస్సేజ్ చేస్తే చేయాలి

2. మీ పికప్ అడ్రస్, డెస్టినేషన్ పాయింట్స్ వివరాలు, పికప్ కోసం లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. వెంటనే క్షణాల్లో రైడ్ ఫెయిర్ ఎంత, ఇతర వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. రైడ్ నిర్ధారించుకుని యాక్సెప్ట్ చేయాలి.

3. దగ్గరలో ఉన్న ఊబెర్ డ్రైవర్ మీ రైడ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తరువాత ఊబెర్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. స్టేటస్ అప్‌డేట్స్ పంపించేందుకు వాట్సప్ ఉపయోగపడుతుంది.

Also read: Bank Holidays January 2023: జనవరిలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. హాలిడేస్‌ జాబితా ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News