COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ubon J18 Future Pod: ప్రముఖ భారతీయ టెక్‌ బ్రాండ్‌ UBON గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇటీవలే తమ వినూత్న ఇయర్‌బడ్స్ UBON J18 ఫ్యూచర్ పాడ్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ప్రీమియం టచ్‌ డిస్ల్పేతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో పాటు ఇది స్మార్ట్ ఛార్జింగ్ కేస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ కేస్‌కి 1.45-అంగుళాల LED టచ్-స్క్రీన్ డిస్‌ప్లే సెటప్‌ కూడా ఉంటుంది. ఇందులో టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు మ్యాజిక్‌కి సంబంధించిన ప్లేబ్యాక్‌ వివరాలను కూడా నోటీస్‌ చేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఎంతో ప్రీమియంతో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 


ధర:
ఇంత ప్రీమియంతో కూడిన డిస్‌ప్లే కలిగిన యర్‌బడ్స్‌ అతి తక్కువ ధరలో లభించడం ఇదే మొదటి సారిగా భావించవచ్చు. ప్రస్తుతం ఈ బడ్స్‌ UBON కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  దీనిని భారతదేశంలో పాటు వివిధ దేశాల కస్టమర్స్‌కి అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వెళ్లడించింది. అయితే ఈ  ఇయర్‌బడ్స్‌ సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, కంపెనీ దీనిని రూ. 2499లతో లభిస్తోంది. 


60 గంటల ప్లేబ్యాక్‌:
UBON J18 ఫ్యూచర్ పాడ్స్ ఇయర్‌బడ్‌లు అద్భుతమైన కాలింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇందులో ఎంతో శక్తివంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ కూడా లభిస్తోంది. అలాగే ఇయర్‌బడ్‌లో అద్భుతమైన ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు  60 గంటల వరకు ప్లే టైమ్‌ను కూడా అందిస్తుంది. దీంతో పాటు ఫిట్‌నెస్ ఇండికేషన్స్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



ఈ UBON J18 ఫ్యూచర్ పాడ్స్ ఇయర్‌బడ్‌ను ఎంతో సులభంగా ఒకే స్వైప్‌తో అన్‌లాక్ చేయోచ్చు. అంతేకాకుండా ఇందులో వీడియో ప్లేయింగ్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు మీరు దీనినిసులభంగా వీడియోను పాజ్‌ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఇయర్‌ బడ్‌లో ఫోన్‌ లేకుండానే వాల్‌పేపర్‌ మార్చుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీనిని సులభంగా ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో  నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని నియంత్రించే ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి