Upcoming Best Mobiles: త్వరలోనే షావోమీ నుంచి 50MP లీస్ ట్యూన్డ్ రియర్ కెమెరాతో మరో 2 మొబైల్స్..పిచ్చెక్కించే ఫీచర్స్ ఇవే..
Upcoming Best Mobiles Xiaomi 13T, Xiaomi 13T Pro: షావోమీ అద్భుతమైన ఫీచర్స్‌తో త్వరలోనే మార్కెట్‌లోకి మారో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లను Xiaomi 12T లైనప్‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోందని సమాచారం. అయితే ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Upcoming Best Mobiles Xiaomi 13T, Xiaomi 13T Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ కంపెనీ షావోమీ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే Xiaomi 13T, Xiaomi 13T Pro మొబైల్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 26న బెర్లిన్‌లో జరిగే ఈవెంట్ భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌లకి సంబంధించిన అధికారిక ప్రకటన కంపెనీ చేయబోతోంది. ఇదే రోజు కంపెనీ Xiaomi 13T, Xiaomi 13T ప్రో రెండు మొబైల్ ఫోన్‌లను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. ఈ రెండు మొబైల్స్ Xiaomi 12T లైనప్‌లో రాబోతున్నాయని సమాచారం. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ఈ రెండు వేరియంట్స్‌ల స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ విషయానికొస్తే..ఇవి లీస్ ట్యూన్డ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు 13T ప్రో MediaTek Dimensity 9200 చిప్‌సెట్‌పై పని చేయబోతోందని సమచారం. ఇక 13T వేరియంట్ విషయానికొస్తే..MediaTek Dimensity 8200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్స్‌ను కంపెనీ 'మాస్టర్‌పీస్ ఇన్ సైట్' ట్యాగ్‌లైన్‌తో విడుదల చేయబోతోందని సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించి కెమెరాలను లైకా సహకారంతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్స్ 5000mAh బ్యాటరీ సమర్థ్యంతో మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
Xiaomi 13T, Xiaomi 13T ప్రో స్పెసిఫికేషన్లు:
షావోమీ 13T, షావోమీ 13T ప్రో స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..కంపెనీ 13Tలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించబోతోందని వెల్లడించింది. ఇక 13T ప్రోలో మీరు 1.5K రిజల్యూషన్ కూడిన 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రాబోతున్నాయి. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటాయి. అయితే 13T ప్రోలో మాత్రం OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, అదనంగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు Xiaomi 13T PRO అదనంగా 13 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ సెన్సార్ కెమెరాతో రాబోతోందని సమాచారం.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి