Upcoming Cars In Next 2 Weeks : కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? రెండు వారాలు ఆగండి.. లాంచ్ కానున్న టాప్ 4 మోడల్స్ ..పూర్తి వివరాలివే
Upcoming Cars: మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా. అయితే ఇంకో రెండు వారాలు ఓపిక పట్టండి. ఎందుకంటే త్వరలోనే భారత మార్కెట్లోకి నాలుగు కొత్త మోడల్స్ లాంచ్ కాబోతున్నాయి. అందులో మహీంద్రా, హోండా, ఆడి కార్లు ఉన్నాయి. రెండు వారాలు ఆగినట్లయితే ఈ కార్లలో మీకు నచ్చిన మోడల్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరీ ఈ కార్లకు సంబంధించిన ఫీచర్లు, డిజైన్ ధర వంటి వివరాలు తెలుసుకుందాం.
Upcoming Cars In Next 2 Weeks: కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్. రెండు వారాల్లో టాప్ 4 మోడల్స్ కార్లు లాంచ్ కాబోతున్నాయి. త్వరలోనే మార్కెట్లోకి విడుదలవ్వనున్న మహీంద్రా, హోండా, ఆడి కార్లు వాటి ఫీచర్లు, ధర, డిజైన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
మహీంద్రా XEV 9e, BE 6e:
మహీంద్రా కంపెనీ రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను లాంచ్ చేసింది. నవంబర్ 26వ తేదీ ఎక్స్ ఈవీ 9ఈ, బీఈ 6ఈ మోడల్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఈ రెండు కార్లు బ్యాటరీ ఆప్షన్స్ తో వచ్చాయి. 60kWh, 79kWh బ్యాటరీలతో ఈ ఎస్ యూవీలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జీ చేస్తే 450కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బీఈ6 ఈవీ కారులో డ్యూయల్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ తో కాక్ పిట్ కూడా ఉంది. ఇంటీరియర్ బాగుంది. ఎక్స్ఈవీ 9ఈ స్పెషల్ ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్ బోర్డు సెటప్ తో వచ్చింది.
హోండా అమేజ్:
ప్రముఖ కార్ల తయారుదారు సంస్థ హోండా భారత మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ అమేజ్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 4వ తేదీన మార్కెట్లోకి న్యూ జనరేషన్ హోండా అమేజ్ ను రిలీజ్ చేయనుంది. అయితే ఈ కొత్త జనరేషన్ కారులో హోండా పలు మార్పులు చేసినట్లు, ముఖ్యంగా లేటెస్టు ఫీచర్స్ ను పొందుపరిచినట్లు తెలుస్తోంది.
Also Read: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల వ్యాలిడిటీ.. ఇంటర్నెట్ డేటా కేవలం రూ.321 మాత్రమే పూర్తివివరాలు ఇవే...
5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ లింక్ అయిన 1.2లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో ఈ కారు వస్తుంది. హనీకోంబ్ గ్రిల్, విశాలమైన ఎయిర్ ఇన్ లెట్, ఏడీఏఎస్ సూట్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉండనున్నాయి.
ఆడి క్యూ 7 :
ఆడి క్యూ 7 కారు నవంబర్ 28న భారత మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఈ లగ్జరీ కారు సంస్థ ఆడి కొత్త ఆడి క్యూ 7 మోడల్ కార్ల బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించింది. ఆడి ఇండియా వెబ్ సైట్ లేదా మై ఆడి కనెక్ట్ మొబైల్ యాప్ నుంచి రూ. 2లక్షలు చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చని సూచించింది.
Also Read: Gold News: పాతాళానికి బంగారం ధరలు..మూడోరోజు రూ. 2400 తగ్గిన పసిడి.. కొనేందుకు ఇదే మంచి సమయం
ఈ కారులో హెక్సాగోనల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, లేజర్ డయోడ్ లతో కూడిన కొత్త డీఆర్ఎల్ వంటి ఫీచర్లు ఉంటాయి. 3.0లీటర్ల వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ కారు 340 హెచ్ పీ పవర్, 500 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో అందుకుంటుంది. 250కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.