Voice Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేయడంలో భారత దేశం క్రమక్రమంగా తన వాటాను పెంచుకుంటూ పోతోంది. కరోనా సంక్షోభం తర్వాత డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగాయి. మరోవైపు ఈ చెల్లింపులకు అనుగుణంగా యూపీఐ పేమెంట్స్ లోనూ ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బు ఎవరికైనా చెల్లించాల్సి ఉంటే.. గతంలో అన్ని వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పని లేకుండానే వాయిస్ ఆధారిత పేమెంట్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. అందుకు సంబంధించిన కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఆవిష్కరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ కొత్త ఆవిష్కరణలను ప్రజలకు వినియోగార్థం తీసుకొచ్చింది. 'హలో! యూపీఐ' అనే విధానంతో యూప్స్.. టెలికాం కాల్స్ సహా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల సాయంతో వాయిస్ ఆధారిత డిజిటల్ చెల్లింపులకు వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం వీటి సేవలు ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే అందుబాటులో ఉండగా.. అతి కొద్ది సమయంలోనే దేశంలోని ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్‌పీసీఐ (NPCI) స్పష్టం చేసింది. 


ఈ గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్‌లో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆవిష్కరించిన ఉత్పత్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటుగా క్రెడిట్ లైన్ వినియోగదారులు యూపీఐ ద్వారా బ్యాంకుల నుంచి ముందస్తుగా మంజూరు చేసిన రుణాలను ఇది యాక్సెస్ చేయగలదని ఎన్‌పీసీఐ (NPCI) స్పష్టం చేసింది. మరో ఉత్పత్తి LITE X ద్వారా ఆఫ్ లైన్‌లోనూ డబ్బును పంపే సదుపాయం ఉంది. 


Also Read: Savings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి  


వీటితో పాటుగా యూపీఐ ట్యాప్ అండ్ పే, స్కాన్ అండ్ పే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు చెల్లింపులు పూర్తి చేయడానికి వ్యాపారాల వద్ద నియర్ ఫీల్ట్ కమ్యూనికేషన్ (NFC) ప్రారంభించిన క్యూఆర్ కోడ్ లను వాడుకునే అవకాశం ఉంది. 


100 బిలియన్ లావాదేవీలే లక్ష్యంగా..
ఎన్‌పీసీఐ (NPCI) ప్రకారం.. ఈ ఉత్పత్తులను కలుపుకొని దేశంలో స్థిరమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 100 బిలియన్ డిజిటల్ లావాదేవీల లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇవి సహాయపడతాయని ఎన్‌పీసీఐ ఆశిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎన్‌పీసీఐ అడ్వైజర్, ఇన్ఫోసిస్ నాన్ - ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని, NPCI నాన్ - ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిశ్వ మోహన్ మహాపాత్ర కూడా పాల్గొన్నారు.


Also Read: Xiaomi S3 Watch Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Xiaomi S3 వాచ్‌..లీకైన ఫీచర్స్‌ ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook