Xiaomi S3 Watch Price In India: మిడ్ రేంజ్ ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్ కంపెనీ షావోమీ (Xiaomi) కొత్త కొత్త ఫీచర్స్‌తో S సిరీస్ స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తోంది. అయితే ఇంతకముందు విడుదల చేసిన S2 స్మార్ట్‌వాచ్‌కు మంచి డిమాండ్ ఉండడంతో దీనికి సక్సెసర్‌గా Xiaomi వాచ్ S3(xiaomi s3 watch)ని త్వరలోనే విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ వాచ్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రాబోతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ వాచ్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెసిఫికేషన్‌లు వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
షావోమీ వాచ్ S3(xiaomi s3 watch)కి సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇది గతంలో విడుదల చేసిన s2 స్మార్ట్ వాచ్ కంటే ఆప్డేట్ ఫీచర్స్‌తో రాబోతోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతక ముందు విడుదల చేసిన స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే పరిమాణం కంటే పెద్దగా ఉంటుంది. గత సంవత్సరం ప్రారంభించిన Xiaomi వాచ్ S2 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు SpO2ను ట్రాకింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉందుంది.
లీకైన ఫీచర్లు:
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన వివరాల ప్రకారం..Xiaomi వాచ్ S3 ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో రాబోతోందని తెలుస్తోంది. ఈ వాచ్ బిగ్ OLED డిస్‌ప్లేతో పాటు 520mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్ తెలిపారు. దీంతో పాటు ఈ స్మార్ట్ వాచ్ 4G కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ వాచ్ బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో పాటు హృదయ స్పందన మానిటర్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. Xiaomi వాచ్ S3 వాయిస్ కాలింగ్ సపోర్ట్‌తో రాబోతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ వాచ్‌కి సంబంధించిన వివరాలు కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
Xiaomi వాచ్ S2 ప్రత్యేకత:
✾ 1.32 అంగుళాల స్క్రీన్ పరిమాణం
✾ 466×466 పిక్సెల్ రిజల్యూషన్ సపోర్ట్
✾ AMOLED డిస్‌ప్లే
✾ హైకింగ్, సైక్లింగ్ ట్రాక్
✾ హార్ట్ రేట్ ట్రాకర్
✾ పీరియడ్ ట్రాకర్
✾ బ్లూటూత్ v5.2 కనెక్టివిటీ
✾ SpO2 మానిటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి