COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo K12X 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో రాఖీ సేల్స్ ప్రారంభమయ్యాయి. రాఖీ పండగ సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని రకాల వస్తువులపై అత్యధిక తగ్గింపుతో విక్రయిస్తోంది. అంతేకాకుండా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులను 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌లో అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, టాప్స్‌పై ఎన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. 


ఎప్పటినుంచో అతి తక్కువ ధరలతో మంచి మొబైల్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రాఖీ ప్రత్యేకమైన సేల్ సరైందిగా భావించవచ్చు. కొన్ని చైనా బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ సగం ధరతోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్మి, వివో, ఒప్పో వంటి బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేసే వారికి 30 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న రాఖీ పండగ సేల్‌లో భాగంగా vivo k12x 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభించనుంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా అద్భుతమైన మరెన్నో ఆఫర్స్ అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ vivo k12x 5G స్మార్ట్ ఫోన్ రూ.18,999తో అందుబాటులో ఉండగా.. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి 15 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. 


అయితే రాఖీ సందర్భంగా ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి కేవలం రూ. 12,999కే పొందవచ్చు. ఈ మొబైల్ మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్‌ను హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.


అలాగే ఈ vivo k12x 5G స్మార్ట్‌ఫోన్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్తో మొబైల్ ను పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌కి ఎక్ఛేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను కేవలం ఈ మొబైల్‌ను రూ.6,000 లోపే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.