VIVO T3 Ultra launch: పవర్ ఫుల్ 50MP కెమారా 12GB Ram AI ఫీచర్లతో VIVO T3 Ultra వచ్చేసింది
VIVO T3 Ultra launch: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం వివో స్మార్ట్ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో ఫోన్ లాంచ్ అయింది. సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో VIVO T3 Ultra లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VIVO T3 Ultra launch: అద్బుతమైన కెమేరా రిజల్యూషన్, ఆకర్షణీయమైన డిజైన్లకు పెట్టింది పేరు వివో. అందుకే మార్కెట్‌లో ఈ కంపెనీ ఫోన్లకు ఆదరణ ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా VIVO T3 Ultra లాంచ్ చేసింది. ఇందులో ఒకదాన్ని మించి మరొక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
VIVO T3 Ultra స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ 3డి కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ బ్యాంటరీ 5500 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంది. అంతేకాకుండా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతానికి రంగుల్లో లభ్యమౌతోంది. ఒకటి లూనార్ గ్రే, రెండవది ఫ్రాస్ట్ గ్రీన్. ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ ఆధారంగా పనిచేస్తుంది. యాంటీ వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ విషయంలో ఐపీ 68 రేటింగ్ కలిగి ఉండటం విశేషం.
VIVO T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌లో యూఎస్ బి 2.0 పోర్ట్, బ్లూటూత్ 5.3 వెర్షన్, వైఫై 5 సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరేజర్, ఎడిట్ ఆప్షన్ వంటివి ఉన్నాయి. ఇవి మీ ఎడిటింగ్ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతాయి. ఇక ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ కాగా రెండవది 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్. ఇక మూడవది 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇక కెమేరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ కెమేరా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ రేర్ కెమేరా ఉంటాయి. ఇవి కాకుండా సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. VIVO T3 Ultra 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 31,999 రూపాయలు కాగా 256 జీబీ స్టోరేజ్ అయితే 33,999 రూపాయలకు లభిస్తోంది. అదే 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 35,999 రూపాయలు.
Also read: CBSE Scholorship 2024: సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయితే ఈ మెరిట్ స్కాలర్‌షిప్ మీ కోసమే. ఇలా అప్లై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.