VIVO T3 Sales: వివో సంస్థ నుంచి ఇటీవల లాంచ్ అయిన VIVO T3లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్రీ బుకింగ్ నడుస్తోంది. అమ్మకాలు మార్చ్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్లు కూడా వర్తించనున్నాయి. వివో టి3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIVO T3 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఓఎస్ అప్‌డేట్ రెండేళ్లపాటు అందిస్తుంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రోసెసర్ ఉంటుంది. ఈ పోన్ ర్యామ్ గరిష్టంగా 8జీబీతో అందుబాటులో ఉన్నా...మరో 8జీబీ అంటే 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు. దాంతో ఫోన్ పనితీరు అత్యంత వేగంగా ఉంటుంది. హ్యాంగ్ ప్రస్తావనే ఉండదు. 


వివో టి3 కెమేరా విషయంలో అగ్రస్థానంలో ఉంటుంది. సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ కలిగిన 50 మెగాపిక్సెల్ సోనీ కెమేరా ఉంటుంది. ఇది కాకుండా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్ ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇక డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ బ్యాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. 44 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్చ్ చేస్దుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 


వివో టి3 8 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ 19,999 రూపాయలకు లభిస్తోంది. ఇక 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 21.999 రూపాయలుగా ఉంది. మార్చ్ 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సహా వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్‌లో అమ్మకాలు జరగనున్నాయి. హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే తక్షణం 2000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. అంతేకాకుండా 599 రూపాయల విలువైన వివో ఎక్స్ఈ 710 ఇయర్‌ఫోన్స్ లభించనున్నాయి. 


Also read: RBI Credit Card Rules: క్రెడిట్ కార్డు కొత్త రూల్స్, ఇకపై బిల్లింగ్ సైకిల్ మీరే ఎంచుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook