VIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకే
VIVO T3X: దేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ స్మార్ట్ఫోన్లలో ఒకటి వివో. అద్భుతమై కెమేరా అనుభవం కోసం చాలామంది వివో స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడుతుంటారు. తాజాగా వివో నుంచి VIVO T3X లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం..
VIVO T3X: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎం15, రియల్ మి పి1, మోటో జి64 ఫోన్లకు దీటుగా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది.
వివో టీ3ఎక్స్ VIVO T3X స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 1000 నిట్స్ రిజల్యూషన్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పనిచేయడం వల్ల పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం మరో ప్రత్యేకత.
ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ బోకె కెమేరా ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. అంతేకాకుండా డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సెలెస్టియన్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ రంగుల్లో లభిస్తోంది.
VIVO T3X మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర 13,499 రూపాయలుగా ఉంది. ఇక 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 14,999 రూపాయలుంది. ఇక 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 16,499 రూపాయలు లభిస్తోంది. ఏప్రిల్ 24 మద్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, వివో ఇ స్టోర్‌లలో అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.
Also read: Bitcoin Scam: బిట్ కాయిన్ స్కాంలో శిల్పాశెట్టి దంపతుల మెడకు ఈడీ ఉచ్చు, 98 కోట్ల ఆస్థులు జప్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook