VIVO V30e: వివో స్మార్ట్‌ఫోన్లలో వి సిరీస్ అంటే కెమేరా, డిజైన్‌కు పెట్టింది పేరు. అందుకే వివో వి సిరీస్ నుంచి VIVO V30e లాంచ్ కాగానే మార్కెట్‌లో క్రేజ్ పెరిగింది. 50 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ కెమేరాతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌తో 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్లు సెక్యూురిటీ అప్‌డేట్స్ ఉచితంగా అందుతాయి. ఈ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రోసెసర్తో అడ్రినో 710 జీపీయూ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వస్తోంది. ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బి టైప్ సి ఆడియో పోర్ట్, యాంటీ డస్ట్ అండ్ వాటర్, డ్యూయల్ 4జి టెక్నాలజీ సపోర్ట్ ఉంటాయి. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.1, వైఫై 6 పనిచేస్తాయి. 


ఈ ఫోన్‌లో 8జీబి ర్యామ్-128 జీబీ నుంచి 256 జీబీ వరకూ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటాయి. 8జీబీ ర్యామ్ కావడంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఫోన్ హ్యాంగింగ్ సమస్య చాలావరకూ ఉండదు. ఇది హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమేరా విషయంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం కూడా 50 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ కెమేరా ఉంటుంది. 


సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ రంగుల్లో లభ్యమయ్యే VIVO V30e ధర అందుబాటులోనే ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 27,999 రూపాయలు కాగా, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ మాత్రం 29,999 రూపాయలకు లబించనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మే 9 నుంచి అన్ని చోట్లా లభించనుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సి వంటి వివిధ బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లబిస్తుంది. అంతేకాకుండా 12 నెలల వరకూ జీరో డౌన్ పేమెంట్ సౌకర్యం వర్తిస్తుంది. 


Also read: Top smartphones: శాంసంగ్, వన్‌ప్లస్, గూగుల్ నుంచి ఈ నెలలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook