COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo T2 Pro 5G Price: ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ సేల్‌ డిసెంబర్‌ 6వ తేదిన ముగియనుంది. కాబట్టి అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సువర్ణావకాశంగా భావించంవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్‌లో భాగంగా Vivo T2 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫ్లిఫ్‌కార్ట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర MRP రూ.26,999 కాగా..బొనాంజా సేల్‌లో భాగంగా రూ.3,000 తగ్గింపుతో కేవలం రూ.23,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఈ  Vivo T2 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు ఏ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ Vivo T2 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.22,550 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌, కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇలా అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ రూ.1,449కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ మీ పాత స్మార్ట్‌ ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు:
6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
HD ప్లస్ రిజల్యూషన్
Android 13 ఆధారిత FuntouchOS 13
1300 nits పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌
MediaTek Dimension 7200 ప్రాసెసర్ 
8GB వర్చువల్ RAM సపోర్ట్‌


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి