Vivo T2X 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకి సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. vivo ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ను vivo T2x 5Gను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ vivo T2x 5G మొబైల్‌ రూ.20,999కే లభిస్తోంది. అయితే నవరాత్రుల సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 23 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.15,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T2x 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే ఆఫర్స్‌లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే..ఈ vivo T2x 5G స్మార్ట్ ఫోన్‌పై అదనంగా రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ. 1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఈ vivo T2x 5G మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేసేందుకు ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ వద్ద ఉన్న ఓల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి రూ.8,399 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ.7,600కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ ద్వారా కూడా కొనుగోలు చేయోచ్చు. రూ.5333 చెల్లించి 3 నెలల పాటు నో కాస్ట్‌ ఈ ఆప్షన్‌ కూడా పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook