Vivo V30 Price: రింగ్ లైట్ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!
Vivo V30 Price: శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V30 Price: శక్తివంతమైన కెమెరాల జాబితాల్లో వీవో మొబైల్స్ కూడా ప్రత్యేకమై చోటు సంపాదించుకున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ను ప్రీమియం కెమెరాతో లాంచ్ చేస్తూ వస్తోంది. ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో రావడంతో చాలా మంది యువత ఇలాంటి మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మార్కెట్‌లో వీటికి ఉన్న డిమాండ్ గుర్చించి కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Vivo V30 సిరీస్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన లాంచింగ్ తేదిని కూడా ప్రకటించింది. భారతదేశ వ్యాప్తంగా వీవో మే 2వ తేదిన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో ఈ Vivo V30 సిరీస్‌ను వచ్చే మొదటి వారంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మే 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో లభించబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఆరా రింగ్ లైట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు జెమ్-కట్ డిజైన్‌తో అద్భుతమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ప్రత్యేక డిజైన్:
ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పోస్టర్ ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్‌లో ప్రత్యేక్ష ప్రసారం కాబోతోంది. దీంతో పాటు ఈ Vivo V30e సిరీస్ మొబైల్ ప్రత్యేమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు బయటికి చూడడానికి ఎంతో లగ్జరీ లుక్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది వెల్వెట్ రెడ్, సిల్క్ బ్లూ రంగులలో లభించబోతోంది. ఇది డ్యూయల్ కెమెరాతో పాటు LED ఫ్లాష్ సెటప్‌తో రాబోతోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
5500mAh బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
డిస్ప్లే:
6.78-అంగుళాల AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
2800 నిట్స్ గరిష్ట ప్రకాశం
HDR10+ సపోర్ట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ప్రాసెసర్, RAM:
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్
8GB లేదా 12GB LPDDR4x RAM
స్టోరేజ్:
128GB, 256GB లేదా 512GB UFS 3.1 స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరణ
కెమెరాలు:
50MP ప్రధాన కెమెరా (OIS)
50MP అల్ట్రా-వైడ్ కెమెరా
8MP డెప్త్ కెమెరా
బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్:
Android 14 Funtouch OS 13
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి