Vivo V30 Series Offers: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V30 సిరీస్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్.. పూర్తి వివరాలు ఇవే!
Vivo V30 Series Discount Offers: ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన Vivo V30 సిరీస్ మొబైల్స్‌కి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌తో పాటు బ్యాక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V30 Series Discount Offers: ప్రమఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో గత వారం ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్‌ను లాంచ్ చేసింది. Vivo V30 సిరీస్‌లో విడుదలై ఈ మొబైల్ తక్కువ కాలంలోనే మార్కెట్‌లో మంచి సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V30 సిరీస్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వెనిలా మోడల్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ.33,999తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GBర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ రూ.35,999 ధరల్లో లభిస్తున్నాయి. దీంతో పాటు V30 ప్రో వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 41,999తో లభిస్తోంది. దీంతో పాటు 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ.46,999తో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
ఇక ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు Vivo V30 సిరీస్ మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.4,700 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా HDFC బ్యాంక్, SBI బ్యాంక్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే, రూ.4,000 అదనపు బోనస్ లభిస్తుంది. దీంతో పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు.
Vivo V30 సిరీస్ టాప్ 10 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.44-అంగుళాల AMOLED డిస్ప్లే, 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 680
ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్: 8GB, 128GB
బ్యాక్ సెటప్: 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా
ముందు: 50MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4200mAh, 33W ఫాస్ట్ చార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 12, Funtouch OS 12
కనెక్టివిటీ: 5G, Wi-Fi 6, Bluetooth 5.2, USB Type-C
డిజైన్: 2.5D కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లోరైట్ AG డిజైన్
3 కలర్స్: Shimmer Black, Sunshine Gold, Misty Blue
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి