COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo V40: వీవో నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా వాటర్‌ప్రూఫ్ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ Vivo V40 సిరీస్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అతి శక్తివంతమైన 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ రెండు మోడల్స్‌ రాబోతోంది. ఇది V40, V40 Pro మోడల్స్‌లో లాంచ్‌ కాబోతున్నాయి. ఈ మొబైల్స్‌ గతంలో లాంచ్‌ చేసిన V30 సిరీస్‌కు సక్సెసర్‌గా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను యూరోపియన్ మార్కెట్‌లో గత నెలలో లాంచ్‌ చేసింది. అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇటీవలే ఓ టెక్‌ వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ Vivo V40 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ 5500mAh బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు వీవో దీనిని ఆగస్టు నెలలో భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అన్ని మొబైల్స్‌ కంపెనీ చాలా సన్నగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ రెండు మోడల్స్‌కి రెండు మోడళ్లకు డస్ట్‌తో పాటు వాటర్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఇవి రెండు 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ సెటప్‌తో ఈ సిరీస్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ Vivo V40 సిరీస్‌ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు అలాగే జీస్ ఆప్టిక్స్ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు ప్రచారం కూడా నడుస్తోంది. భారత్‌లో లాంచ్‌ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ కూడా ఇటీవలే విడుదలైనా యూరోపియన్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ల్పే 2800x1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో రానుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌,  4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌
Adreno 720 GPU 
2GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌
50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా
20 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
USB టైప్-C పోర్ట్ 
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5500mAh బ్యాటరీ
డ్యూయల్ సిమ్, 5G
WiFi 6, బ్లూటూత్ 5.4, NFC


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి