Vivo X100 Pro: ZEISS కెమెరా సెటప్‌తో విడుదలైన మొట్టమొదటి Vivo X100 సిరీస్..కెమెరా ప్రత్యేకత ఇదే..
Vivo X100 Series Launch: అందరూ ఎంతగానో ఎదురు చూసిన Vivo X100 Pro, X100 మోడల్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన విక్రయాలు జనవరి 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
vivo x100 pro price in india: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో నుంచి X100 సిరీస్ మొబైల్స్ లాంచ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా కంపెనీ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించిన ఈ స్మార్ట్ ఫోన్స్ గురువారం విడుదల చేసింది. కంపెనీ ఈ మొబైల్స్ ను Vivo X100 Pro, X100 మోడల్స్‌లో లాంచ్ చేసింది. అయితే ఈ రెండు మొబైల్ కి సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కెమెరాలను ZEISS భాగస్వామ్యంతో తయారు చేసినట్లు వివో వెల్లడించింది. దీంతోపాటు వీటికి కెమెరాలు 100x వరకు జూమ్‌ని క్యాప్చర్ సపోర్ట్ ఫీచర్ ని కూడా అందిస్తోంది. అదనంగా టెలిఫోటో సన్‌షాట్ ఫీచర్ కూడా కలిగి ఉంది.
ప్రస్తుతం ఇండియాలో Vivo X100 Pro స్మార్ట్ ఫోన్ 16GB + 512GB స్టోరేజ్ ఆప్షన్ లో లభిస్తోంది. ఈ మొబైల్ ధర రూ.89,999తో మార్కెట్లో లభించనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక Vivo X100 స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ విషయానికొస్తే..12GB+256GB ధర రూ.63,999కు లభిస్తోంది. ఇక రెండో వేరియంట్ 16GB + 512GB రూ.69,999తో లభించనుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను వివో అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు లభించడానికి బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ICICI, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వివో అధికారిక వెబ్సైట్లో Vivo X100 Pro, X100 స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. అయితే ఈ మొబైల్స్ సంబందించిన విక్రయాలను జనవరి 11న ప్రారంభించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter