Vivo Y02 Price Cut: ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో లభించే కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌కి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను తయారు చేసే విక్రయిస్తున్నాయి. ఇటీవలే రియల్ మీ, రెడ్‌మీ విడుదల చేసిన కొన్ని మొబైల్స్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో తమ కొత్త మార్కెట్లోకి ఇటీవలే లాంచ్ చేసింది. ఇది కూడా ఎక్కువ ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభిస్తోంది. వివో నుంచి అతి తక్కువ ధరకే లాంచ్ అయినా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఏంటో? డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో ఇటీవలే Y02t మోడల్ లో అందించింది. అయితే మొదటగా ఈ మొబైల్ ను  4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఇది MRP ధర రూ.15,999తో లభిస్తోంది..అయితే ప్రత్యేక సేల్ లో భాగంగా 53% తగ్గింపుతో రూ.7,500 కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ ను బ్యాంక్ ఆఫర్స్‌తో కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్ ఈ మొబైల్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ.7,100 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 400కే పొందవచ్చు. అలాగే అమెజాన్ ఈ మొబైల్ పై ఇతర ఆఫర్స్ ను కూడా అందిస్తోంది దీనికోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. 


Vivo Y02t ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
వివో ఈ స్మార్ట్ ఫోన్‌ను అతి శక్తివంతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మొబైల్ 6.51 అంగుళాల HD + డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే 1600x720 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన స్టోరేజ్ విషయానికొస్తే..64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ను కంపెనీ MediaTek Helio P35 చిప్‌సెట్‌తో విడుదల చేసింది. అలాగే ఈ మొబైల్ ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ ని కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్ ని ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకోవచ్చు.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


ఇతర ఫీచర్లు:
✾ 8 మెగాపిక్సెల్‌ సింగిల్ కెమెరా సెటప్‌
✾ 5 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్‌ కెమెరా
✾ LED ఫ్లాష్‌
✾ Funtouch OS 13 OS
✾ Android 13
✾ 5000mAh బ్యాటరీ 
✾ 10 వాట్ల ఛార్జింగ్‌ సపోర్ట్
✾ డ్యూయల్ సిమ్ సపోర్ట్
✾ Wi-Fi, బ్లూటూత్ 5.0, USB 2.0, GPS


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి