Vivo Y200e launch date in India: స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రాబోతుంది. మధ్య తరగతి వారిని టార్గెట్ చేసుకుని ఈ ఫోన్ లాంచ్ చేస్తోంది వీవో. భారత మార్కెట్లో వివో వై200ఈ(Vivo Y200e) పేరుతో ఈ మెుబైల్ ను విడుదల చేయబోతుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 22న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీవో వై200 ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీచర్స్ మరియు ధర ఇదే..
ఈ ఫోన్‌ను ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తీసుకురాబోతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ తో రాబోతుంది. ఈ ఫోన్‌ బ్లూ, ఆరెంజ్ కలర్స్ లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. FuntouchOS కలిగిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ పై పనిచేయనుంది.


ఈ స్మార్ట్ ఫోన్ 6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర ₹23,999 మరియు 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹25,999గా ఉండబోతుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లభించే అవకాశం ఉంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్‌ ప్రైమరీ సెన్సార్ తో రాబోతుంది. ఫ్రంట్ 16 మెగాఫిక్సల్ ను కలిగి ఉంది.  ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ తోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌తో కూడా వస్తుంది.


Also Read: OnePlus 12R - Oneplus 12 Price: వన్‌ప్లస్‌ నుంచి గుడ్‌ న్యూస్‌..ఈ మొబైల్స్‌పై రూ.2 వేల తగ్గింపు!


Also Read:  Poco X6 Pro 5G Vs Honor X9b: ఈ రెండింటిలో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా బెస్ట్ మొబైల్‌ ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter