Vivo Y28 4G Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో(Vivo) మార్కెట్లోకి తమ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది కంపెనీ దీనిని Vivo Y28 4G స్మార్ట్ ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్ డిజైన్ ఇటీవలే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన  iQOO Z9x స్మార్ట్ ఫోన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. వివో కు సంబంధించిన ఈ మొబైల్ కంపెనీ మొదట సింగపూర్లో విడుదల చేసింది ఇది 6,000mAh బ్యాటరీతో పాటు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో అనేక రకాల కొత్త ఫీచర్లను వివో పరిచయం చేసింది. అయితే ఈ మొబైల్ కొత్త ఫీచర్స్ ఏంటో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo కొత్త Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్‌ను 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే..ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ 256 జీబీ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్ ధర 268 సింగపూర్ డాలర్లతో లభిస్తోంది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లోకి లాంచ్ అయితే దీని ధర రూ. 16 వేలకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కంపెనీ దీనిని రెండు కలర్ ఆప్షన్స్ లో తీసుకువచ్చింది. ఈ మొబైల్ సింగపూర్లో అన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ తో పాటు వివో స్టోర్లలో లభిస్తోంది.


Vivo Y28 4G స్పెసిఫికేషన్‌లు:
ఇక ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, Vivo Y28 4G స్మార్ట్ ఫోన్ Android 14-ఆధారిత Funtouch OS 14 పై నడుస్తుంది. దీంతోపాటు 6.68-అంగుళాల HD+ ఎల్సిడి డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే 1,608 x 720 పిక్సెల్స్ రిజర్వేషన్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది 90Hz వరకు రిఫ్రెష్ రేట్ తో పాటు 1,000 nits పీక్ బ్రైట్‌నెస్‌ కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek యొక్క Helio G85 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. రక్షణ కోసం కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కి IP64-రేటెడ్ బిల్డ్‌ సెటప్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా డైనమిక్ లైట్‌ని కూడా కలిగి ఉంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్ వివరాలు..
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్
2-మెగాపిక్సెల్ బోకె లెన్స్ కెమెరా
 LED ఫ్లాష్ యూనిట్‌
8 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్
44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
6,000mAh బ్యాటరీ యూనిట్‌
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి