Vivo Y300 5G Price: ఎట్టకేలకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వీవో నుంచి ప్రీమియం ఫీచర్స్‌తో మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇది Y-సిరీస్ లైనప్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. వీవో Vivo Y300 5G అనే పేరుతో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం ఇంటర్‌ఫేస్‌తో విడుదలైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌లో విడుదలైంది. అంతేకాకుండా కంపెనీ దీనిని ఫాంటమ్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్‌తో పాటు టైటానియం సిల్వర్ కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ కానుంది. ఈ మోడల్ రూ.25,000 బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా లాంచ్‌ అయిన వెంటే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీల్లో ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌తో కూడా లభిస్తోంది. 


ఈ Vivo Y300 5G మొబైల్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీలు ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌లలో కొనుగోలు చేసేవారికి రూ.2 వేల వరకు తక్షణ డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభించనున్నాయి. ఇక ఈ మొబైల్‌లో కొన్ని ప్రత్యేకమైన Ai ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులోని AI సూపర్‌మూన్, AI ఎరేస్ వంటి కెమెరా ఫీచర్స్‌ లభిస్తుంది. ఇక దీనిని వివో నవంబర్‌ 21వ తేదిన అందుబాటులోకి తీసుకు వచ్చింది. 


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్


ఈ Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 8GB + 128GB స్టోరేజ్‌తో పాటు 8GB + 256GB స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదలైంది. ఇది మోడల్‌ను బట్టి ధరలను కలిగి ఉంది  ఇందులో చివరి వేరియంట్‌ ధర రూ. 23,999 నుంచి ప్రారంభం కాబోతోంది. Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఇది 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50MP సోనీ IMX882 ప్రధాన సెన్సార్‌తో వచ్చింది. అలాగే ఫ్రంట్‌ భాగంలో  32MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌లో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.