Vivo Y37 Pro Price: రూ. 21,403కే మార్కెట్‌లోకి అద్భుతమైన Vivo Y37 Pro మొబైల్.. ఫీచర్స్ భలే ఉన్నాయ్!
Vivo Y37 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి మంచి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ పేరుతో విడుదలైంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo Y37 Pro Price: ప్రముఖ మొబైల్ కంపెనీ వీవో నుంచి మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ Vivo Y37 ప్రో పేరుతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ మొదటగా చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఇది త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,000 కంటే తక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో రాబోతోంది. అలాగే ఇది 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇక దీని డిస్ల్పే 6.68-అంగుళాలతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే 5MP సెల్ఫీ కెమెరాలను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Vivo Y37 ప్రో ధర వివరాలు:
మార్కెట్‌లో ఈ Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ ధర $255 (సుమారు రూ. 21,403)తో విక్రయిస్తోంది. అలాగే ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం లుక్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లో నిలిచిపోనుంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌ను కేవలం సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఈ Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది స్మార్ట్‌ఫోన్‌లో IP64 వాటర్ ప్రొటెక్షన్ సెటప్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా వాటర్ డ్రాప్స్ పడిన దీనిని వినియోగించవచ్చు. అలాగే ఈ మొబైల్ స్టీరియో స్పీకర్లు, వైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉండబోతోంది. దీంతో పాటు ఇతర ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.