WhatsApp India: భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. 37 లక్షల ఖాతాలు బ్యాన్! మీది ఉందో చెక్ చేసుకోండి
WhatsApp bans 37 lakh Indian accounts in November 2022. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. 2022 నవంబర్ 1-30 మధ్య 37 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలు బ్యాన్ చేయబడ్డాయి.
WhatsApp banned over 37 lakh Indian accounts in November 2022: 2022 నవంబర్‌లో లక్షలాది (దాదాపుగా 27 లక్షలు) భారతీయ ఖాతాలను మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) నిషేధించిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలలోని రూల్ 4(1)(D) ప్రకారం ఆ ఖాతాలు నిషేధించబడ్డాయి. అక్టోబర్‌లో 3.5 మిలియన్ ఖాతాలను నిషేధించింది. తాజాగా మరోసారి భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది వాట్సాప్ యాజమాన్యం. తాజా నివేదిక ప్రకారం.. 2022 నవంబర్ 1-30 మధ్య 37 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలు బ్యాన్ చేయబడ్డాయి.
వాట్సాప్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ... 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసులో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు మేము కృత్రిమ మేధస్సు, అత్యాధునిక సాంకేతికత మరియు డేటా శాస్త్రవేత్తలలో నిరంతరం నిమగ్నమై ఉంటున్నాం. హానికరమైన కార్యకలాపాలను మొదటి దశలోనే ఆపడం మా మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే.. నష్టం జరిగాక చర్యలు చేపట్టడంలో అర్థం లేదు' అని అన్నారు.
అనుమానిత ఖాతాలపై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినపుడు, చాలా మంది ఖాతాలను బ్లాక్ చేసిన సందర్భాలలో ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. పాలసీలు మరియు మార్గదర్శకాలను ఉల్లంఘించే ఖాతాలను కంపెనీ బ్యాన్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ఎవరి ఖాతా అయినా క్లోజ్ అవుతుందని హెచ్చరించారు. దేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను వాట్సాప్ కలిగి ఉంది.
400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్.. తనకు వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రతి నెలా భారతీయులకు భారీ షాక్ ఇస్తోంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66,000 ఖాతాలపై నిషేధం విధించింది. ఆపై ప్రతి నెలా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఖాతాలను బ్లాక్ చేస్తూ వస్తోంది. ఇప్పటికైనా మీరు దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండే.. మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.
Also Read: Apple iPhone: రూ.20 వేల లోపే ఐఫోన్.. ఎగబడి కొంటున్న జనం! ఇంత చౌకగా ఇదే తొలిసారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.