Whatsapp Latest Updates: వాట్సాప్‌లో సరికొత్త అప్డేట్.. సీక్రెట్ కోడ్ ఫీచర్ వచ్చేస్తోంది
Whatsapp Secret Code Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. లాక్ట్ చాట్స్‌ను యాప్‌లో మెయిన్ స్క్రీన్ నుంచి హైడ్ చేసుకునేలా.. సీక్రెట్ కోడ్‌తో యాక్సెస్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఆండ్రాయిడ్ బెటా యూజర్లకు రిలీజ్ అవుతోంది.
Whatsapp Secret Code Feature: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. గుడ్ మార్నింగ్‌తో మొదలై గుడ్‌నైట్ చాటింగ్స్‌తో ముగుస్తుంది. మెసెజ్‌లు పంపించుకోవడానికి.. వీడియోలు, ఫొటోలు సెండ్ చేయడానికి.. వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడేందుకు.. వార్తల సమహారాన్ని తెలుసుకునేందుకు వాట్సాప్ ఉపయోగపడుతోంది.
ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తూ.. వాట్సాప్ కూడా వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అదేవిధంగా వినియోగదారుల వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌లో లాక్ చేసిన చాట్‌ల కోసం కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం బీటా టెస్టర్‌లకు ఈ వర్షన్ అందుబాటులో ఉంది.
వినియోగదారుల లాక్ చేసిన చాట్‌ల జాబితాకు కొత్త సెట్టింగ్‌ల విభాగం అందుబాటులో ఉండనుంది. లాక్ చేసిన చాట్‌ను ఓపెన్ చేయడానికి సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. “ప్రత్యేకంగా రహస్య కోడ్‌ను కాన్ఫిగర్ చేసిన తర్వాత.. లాక్ చేసిన చాట్‌లను వీక్షించే ఎంట్రీ పాయింట్ ఇకపై చాట్ లిస్ట్‌లో కనిపించదు. దానికి బదులుగా వినియోగదారులు చాట్స్ ట్యాబ్‌లోని సెర్చ్ బార్‌లో రహస్య కోడ్‌ను నమోదు చేయడం ద్వారా ఈ చాట్‌లను యాక్సెస్ చేయవచ్చు” అని వాట్సాప్ నివేదించింది.
ఈ ఫీచర్‌తో లాక్ చేసిన చాట్‌ల జాబితాకు ఎంట్రీ పాయింట్‌ను తొలగించడం సీక్రెట్ చాట్‌ల విషయంలో మరింత గోప్యత లభిస్తుంది. మీరు లాక్ చేసిన మెసెజ్‌లను ఇతరు సులభంగా గుర్తించలేరు. ఎవరైనా ఫోన్‌ను దొంగిలించినా.. లేదా మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ను వినియోగించినా.. లాక్ చేసిన చాట్‌ను దాచిపెట్టడంతో వాళ్లకు కనిపించదు. సీక్రెట్ చాట్‌ల కోసం ఎవరైనా వాట్సాప్‌లో వెతికినా కనిపించవు. దీంతో పాటు వాట్సాప్ మరో ఫీచర్‌ను తీసుకువచ్చింది. ‘Protect IP Address in Calls’ ఆప్షన్‌తో మీ లోకేషన్‌ను కనిపెట్టకుండా ఉండేందుకు సహాయ పడుతుంది. కొత్త ఆప్షన్ వాట్సాప్ సర్వర్‌ల ద్వారా కాల్స్ చేసినా.. మీ ఐపీ అడ్రస్‌ను దాచి పెడుతుంది. ఐపీ అడ్రస్ తెలియకపోతే మీ లోకేషన్‌ను ఇతరులు కనిపెట్టలేరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook