Whatsapp New Feature: వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. ఇప్పుడు ట్విట్టర్‌లానే మెస్సేజ్ ఎడిట్ ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. ఆ సౌకర్యం గురించి ఇతర వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తోంది. ఇంకొన్ని ఫీచర్లపై నిరంతరం పనిచేస్తోంది. ప్రస్తుతం వాట్సప్ మరో కొత్త ఫీచర్‌పై పరిశోధనలు చేస్తోంది. యూజర్లు తాము పంపించిన మెస్సేజ్‌లను ఎడిట్ చేసుకునే సౌకర్యం కలగనుంది ఈ కొత్త ఫీచర్‌‌తో. ట్విట్టర్ ఎడిట్ బటన్ ఆప్షన్‌లానే వాట్సప్ కూడా ఈ వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. 


WABetaInfo అందించిన రిపోర్ట్స్ ప్రకారం త్వరలోనే వాట్సప్ ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఫలితంగా యూజర్లు తాము పంపించిన వాట్సప్ మెస్సేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. WABetaInfo ఈ విషయాన్ని ఒక స్క్రీన్ షాట్ ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్ గురించి మరింత సమాచారమైతే తెలియదు గానీ..ట్విట్టర్‌లో ఉన్న ఎడిట్ బటన్‌లా పనిచేస్తుందని మాత్రం తెలిసింది.


ఒకసారి యూజర్ వాట్సప్‌లో తాను పంపించిన మెస్సేజ్‌ను ఎడిట్ చేస్తే..పంపించిన వ్యక్తికి ముందు మెస్సేజ్‌లో ఏముందో తెలియదు. ఎడిట్ మెస్సేజ్ మాత్రమే కన్పిస్తుంది. అయితే మెస్సేజ్ ఎడిట్ అయిందని మాత్రం తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్ వెర్షన్ 2.22.20.12లో కన్పిస్తుంది. ఈ ఫీచర్ త్వరలోనే ఐవోఎస్‌లో కన్పించనుంది. వాట్సప్ ఎడిట్ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులో రానుందో ఇంకా తెలియదు.


Also read: Flipkart Sales: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం, 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుకింగ్ సౌకర్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook