World Smallest Smartphone 2024: 100MP కెమెరాతో ప్రపంచంలోనే అతి చిన్న 5G ఫోన్ వచ్చేసింది..
World Smallest Smartphone 2024: ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్‌ను Unihertz లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
World Smallest Smartphone 2024: గతంలో భారత మార్కెట్‌లో కాంపాక్ట్ సైజ్ స్మార్ట్‌ఫోన్‌కి మంచి డిమాండ్ ఉండేది. పోనుపోను కాస్త తగ్గుతూ వచ్చింది. ఇప్పటికీ చాలా మంది చిన్న ఫోన్స్ అంటే ఇష్టపడే వారు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే ఓ కంపెనీ కాంపాక్ట్ సైజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ మొబైల్ 5G సపోర్ట్‌తో పాటు ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ అత్యంత చిన్న సైజులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అయితే ఈ మినీ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ అతి చిన్న స్మార్ట్‌ఫోన్ Unihertz పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇది చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 100 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ప్రీమియం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 12 జీబీ ర్యామ్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ Unihertz స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, భారత మార్కెట్‌లోకి విడుదలైతే.. ధర రూ. 16,600 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మినీ మొబైల్ భారత్‌లో అక్టోబర్ నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇది 5.05-అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ స్క్రీన్ 720x1520 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ డిస్ల్పే ముందు భాగంలో పంచ్ హోల్ కటౌట్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ స్మార్ట్‌ఫోన్ iPhone 13 మినీ కంటే ఎంతో చిన్నగా ఉంటుంది. దీంతో పాటు 180 గ్రాములు కంటే చాలా తక్కువ బరువు ఉంటుంది. అలాగే 128.7x62.7x16.3 మిమీ కొలతలతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌పై సని చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సెక్యూరీ కోసం ఇందులో కంపెనీ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెటప్‌ను కూడా అందిస్తోంది.
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
12GB LPDDR5 ర్యామ్
256GB UFS 3.1 స్టోరేజ్
ప్రత్యేకమైన GPS సపోర్ట్
66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
20 నిమిషాల్లో 90% ఛార్జ్ అవుతుంది
4000mAh బ్యాటరీ
100-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
8-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా
32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి