Xiaomi Pad Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Xiaomi మార్కెట్‌లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీనిని రెడ్‌మీ ప్యాడ్ ప్రో పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ట్యాబ్‌ అద్భుతమైన స్టైలస్ ఇన్‌పుట్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్‌ను కంపెనీ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో 6 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. అలాగే ఎంతో శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పని చేస్తుంది. దీంతో పాటు కంపెనీ ఇందులో అద్భుతమైన డాల్బీ సౌండ్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ ట్యాబ్‌ 10000mAh బ్యాటరీతో లభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్యాడ్‌ను కంపెనీ యూరప్‌ దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర దాదాపు రూ. 27,120 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఇప్పటికే  5G కనెక్టివిటీతో కూడిన వేరియంట్ Google Play కన్సోల్ డేటాబేస్‌లో కనిపించింది. షవోమీ ఈ ట్యాబ్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని భారత్‌ లాంచ్‌ చేస్తే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ప్యాడ్‌ పేరులో మార్పులు జరిగే ఛాన్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 


రెడ్‌మి ప్యాడ్ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ ప్యాడ్ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది 12.1-అంగుళాల 2.5K LCD ప్యానెల్‌ డిప్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ ప్యాడ్‌ స్క్రీన్‌ 2560x1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో లభిస్తోంది. ఇది 120Hz అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు 600 nits HBM బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ ట్యాబ్‌ డాల్బీ విజన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి వస్తోంది. అంతేకాకుండా ఇందులో మెమోరీని పెంచుకునేందుకు కంపెనీ SD కార్డ్ స్లాట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా మరెన్నో ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌:
స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌
Adreno 710 GPU
8 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా 
8 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీ కెమెరా 
10000mAh బ్యాటరీ 
33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 14 ఆధారిత HyperOS
డాల్బీ అట్మోస్‌తో క్వాడ్ స్పీకర్ సెటప్‌
Wi-Fi 6, బ్లూటూత్ 5.2
USB 2.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి