Redmi 12C Launch: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ ఇండియాలో బడ్జెట్ ఫోన్ విభాగంలో రెడ్‌మి 12 సి లాంచ్ చేస్తోంది. ఎప్పుడు లాంచ్ అనేది తేదీ కూడా నిర్ణారణైంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం 10 వేల రూపాయలే ఉండవచ్చని సమాచారం. ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షియోమి ఇండియాలో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచే చేయనుంది. Xiaomi ఈనెల చివర్లో అంటే మార్చ్ 30న Redmi 12Cను లాంచ్ చేస్తోంది. లాంచ్ రోజే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే..ఉచిత బహుమతి కూడా గెల్చుకోవచ్చు. అయితే ఇంకా Redmi 12C లాంచ్ ఈవెంట్ టైమ్‌లైన్ ప్రకటించలేదు. 


Redmi 12C ప్రత్యేకతలు


Xiaomi కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ జి85 చిప్‌సెట్ ఉంటుంది. కంపెనీ ఈ విభగంలో అదే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్. దాంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 


Xiaomi Redmi 12Cలో 6.71 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఇది కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌తోపాటు 5జీబీ పెంచుకునే సామర్ధ్యంతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ల వివరాలేవీ అధికారికం కావు. కేవలం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం లభిస్తున్నవే.


ఈ ఫోన్ ధర గురించి పరిశీలిస్తే Redmi 12C బడ్జెట్ విభాగంలో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే లాంచ్ అయింది. చైనాలో ఈ ఫోన్ ధర 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర దాదాపుగా భారతీయ రూపాయల్లో 8,400 రూపాయలు. ఇండియాలో కూడా ఈ ఫోన్ ధర దాదాపుగా ఇంతే ఉండవచ్చు.


Also read: Mahindra Bolero: బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీని కేవలం 2.2 లక్షలు చెల్లించి తీసుకెళ్లండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook