TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సుమారు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. కొత్త జోనల్ విధానంపై (New Zonal System) ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ ఖాళీల్లో  1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉండనున్నాయి. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి (jobs notification) ప్రభుత్వానికి సోసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్లు రానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో మొత్తం 970 గురుకుల పాఠశాలలు (Gurukul Schools) ఉన్నాయి. వీటిలో అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులన్నీ కలిపి పది వేలకుపైగా ఉన్నట్లు సమచారం. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక  విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే పోలీస్‌ శాఖ తర్వాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉండనున్నాయని తెలుస్తోంది. మరి ఈ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.


Also Read: KCR Prakash Raj: కేసీఆర్ జాతీయ బృందంలో నటుడు ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook