KCR Prakash Raj: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్నారు. అందుకు కోసం ప్రత్యేక బృందాన్ని రూపొందిస్తున్నారు. అందులో ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ కు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ.. ప్రకాష్ రాజ్ ను వెంటబెట్టుకొని వెళ్తున్నారు. ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసేందుకు ముంబయి వెళ్లిన సమయంలోనూ కేసీఆర్ వెంట ఉండి ప్రకాష్ రాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు.
భారతీయ జనతా పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అందులో నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాజకీయలపై పట్టు ఉండడం సహా పలు భాషల్లో ఆయన ప్రావీణ్యుడు కావడం వల్ల ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జాతీయ బృందంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం సహా రాజ్యసభ స్థానానికి కూడా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.
బీజేపీ వ్యతిరేకిగా..
రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. దేశంలో ఏర్పడిన అనేక సమస్యలు, బీజేపీ పనితీరుపై ఆయన రీతిలో గతంలోనూ విమర్శలు గుప్పించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా ప్రకాష్ రాజ్ పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఇటీవలే జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఆయన పరాజయం పొందారు.
Also Read: CM KCR: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
Also Read: KCR-Uddhav Thackeray: కేసీఆర్-ఉద్దవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook