Corona Cases In TS Police Academy | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కరోనా వైరస్(CoronaVirus) కలకలం రేపింది. అకాడమీలో ఏకంగా 180 మంది పోలీసులు ప్రాణాంతక కరోనా బారిన పడ్డారు. ఇందులో వంద మంది ట్రెయినీ ఎస్‌ఐలు, మరో 80 మంది సిబ్బందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ తెలిపారు. అయితే వీరిలో ఎవరికీ కోవిడ్19 సంబంధిత లక్షణాలు కనిపించలేదు, ఇవన్నీ లక్షణాలు కనిపించని కరోనా కేసులు అని వివరించారు. కోటి దాటిన కరోనా కేసులు.. మరణాలు ఐదు లక్షలకుపైనే..


కరోనా సోకిన వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ అకాడమీలో 1100 మందికి పైగా సబ్ ఇన్‌స్పెక్టర్లు, 600 మందికి పైగా కానిస్టేబుల్స్ శిక్షణ పొందుతున్నారని తెలిసిందే. అక్కడ మొత్తం 2200 మంది ఉండగా, అందులో 180 మందికి కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ