Free Power Supply: చారిత్రక ఇంద్రవెల్లి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. నాగోబా ఆలయ దర్శన అనంతరం ఆయన కేస్తాపూర్ సహాయక సంఘాల మహిళా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అతిత్వరలోనే నెరవేరుస్తామని మహిళలకు శుభవార్త తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన వినియోగదారులకు ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. వారి గత కరెంటు బిల్లుల ఆధారంగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని, 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు.


ఈ సందర్భంగా రేషన్ కార్డు లేని లక్షల మంది ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. అంతేకాకుండా త్వరలో ఈసేవా ద్వారా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకోవాలని కూడా తెలిపింది. ఎంతమందికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందో త్వరలో తెలుస్తుంది.


ఇక మహిళా సహాకార సంస్థలకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.  అంతేకాదు, మహిలా సహాకార సంస్థలకే పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే అవకాశం కల్పిస్తామని తెలిపారు.త్వరలోనే గ్యాస్ సిలిండర్ రూ.500 కే ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రియాంక గాంధీని ఆధ్వర్యంలో ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవలె ఫిబ్రవరి నెల చివరిలోనే మహిళలకు రూ.2500 ఖాతాల్లో జమా అవుతాయనే వార్తలు కూడా వచ్చాయి.


ఇదీ చదవండి:  TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!


ఇదీ చదవండి: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook