TS Jobs Notifications: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త..తాజాగా మరో నోటిఫికేషన్..!
TS Jobs Notifications: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మొత్తం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.
TS Jobs Notifications: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మొత్తం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లోకి ఖాళీల భర్తీలకి నోటిఫికేషన్లు వచ్చాయి. పోలీస్, గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
ఈక్రమంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నియామక మండలి నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన వారు ఈపోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఐతే ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల మించకూడదని తెలిపారు.
గరిష్ట వయోపరిమితి 5 ఏళ్ల సడలించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వరుస నోటిఫికేషన్లపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తుండటంతో కోచింగ్ సెంటర్లు అభ్యర్థులతో నిండిపోయాయి. ప్రభుత్వ లైబర్రీలు సైతం కిక్కిరిసిపోతున్నాయి. ఏలాగైనా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు కసరత్తు సైతం జరుగుతోంది.
Also read:International Tea Day 2022: ఎందుకు అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు..?
Also read:Revanth Reddy:ప్రతి రైతుకు అండగా ఉంటాం..రచ్చబండలో రేవంత్‌రెడ్డి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook