Tarun Chugh: తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి 25 మంది నేతలు బీజేపీతో (Telangana BJP) టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 70 పైచిలుకు స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్న తరుణ్ చుగ్ (Tarun Chugh)... బీజేపీపై వారికి విశ్వాసం పెరిగిందన్నారు. తమ పార్టీ విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని.. రైతులు పండించిన ప్రతీ గింజ కేంద్రం కొంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయమని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ ఒక అబద్దాల కోరు అని... ప్రజలు ఆయన మాటలను విశ్వసించే పరిస్థితి లేదని విమర్శించారు. 


Also Read: Narayan Rane: వచ్చే మార్చికల్లా 'మహా' సర్కార్ కూలిపోతుంది-కేంద్రమంత్రి సంచలనం


ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ఏం చేశాడని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. త్వరలోనే టీఆర్ఎస్ (TRS) పతనమవుతుందని.. కుటుంబ, అవినీతి పార్టీకి కాలం చెల్లిందని అన్నారు. ఇకనైనా కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని... ఆ చట్టాలు అమలులోకి వస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా, యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడో  పేడో తేల్చుకునేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించని సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజులు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. దీంతో కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై (CM KCR) ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. తెలంగాణ భవన్‌లో బిల్లులు రెట్టింపు అవడం తప్ప కేసీఆర్ టూర్‌తో ఒరిగిందేంటని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఈ పరిణామం పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఢిల్లీలో దోస్తీ... గల్లీలో కుస్తీ అనే విమర్శలకు బీజేపీ పెద్దలు చెక్ పెట్టారని భావిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి