వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడిపోవడంతో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐనవోలు మండలం వనమాల కానపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి సహస్ర మృతి చెందింది. కోట పూర్ణచందర్, లావణ్య దంపతుల కూతురు అయిన సహస్ర... ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి తమ కళ్లముందే మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


[[{"fid":"185968","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇంటి ఆవరణలోనే ఉన్న నీటి సంపు.. తమ కూతురు పాలిట మృత్యుపాశం అవుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు చేస్తున్న ఆక్రందనలు స్థానికులను కలిచి వేస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..