4 year old Boy Killed by his uncle in Rangareddy district: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడిని హతమార్చారు. లక్ష్మినరసింహ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. లక్ష్మినరసింహను (Lakshminarasimha) శనివారం ఉదయం అతని బాబాయి వీరేశ్‌ (Babai Veeresh‌) బయటకు తీసుకెళ్లాడు. అయితే సాయంత్రం నిర్మానుష్య ప్రాంతంలో లక్ష్మినరసింహ మృతదేహం (Dead body) లభ్యమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. కేంద్రానికి మూడు డిమాండ్లు..రెండ్రోజుల్లో తేల్చుకోని వస్తాం


లక్ష్మినరసింహ తలపై బండరాయితో కొట్టి చంపినట్టు గాయాలు ఉన్నాయి. కుటుంబ కక్షలతోనే లక్ష్మినరసింహను (Lakshminarasimha) అతని బాబాయి వీరేశ్‌ చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మినరసింహ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. కేసు (Case) దర్యాప్తులో ఉంది. 


Also Read : వైరల్‌ వీడియో: గాయనిపై బకెట్లతో డబ్బుల వర్షం కురిపించారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook