హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మరోవైపు కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏరోజుకు ఆరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించడం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా నేడు శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 75 కేసులు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజు నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. దీంతో తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య మొత్తం 186కు చేరుకుంది. 


కరోనా వైరస్ పూర్తిగా నయమైన 15 మందిని నేడు ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..