షాకింగ్ న్యూస్: సెల్ ఫోన్ కోసం విద్యార్ధి హత్య
భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్క సెల్‌ఫోన్ కోసం విద్యార్ధి ప్రేమ్ కుమార్ ను హతమార్చాడు ఓ సహ విద్యార్ధి. ఉప్పల్ పీఎస్ పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్ధి ఆదిభట్లలో శవమై కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు నచ్చిన సెల్‌ఫోన్ మిత్రుడు ప్రేమ్ కుమార్ వద్ద ఉందని గ్రహించిన సాగర్ అనే యువకుడు దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధితో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్క సెల్‌ఫోన్ కోసం విద్యార్ధి ప్రేమ్ కుమార్ ను హతమార్చాడు ఓ సహ విద్యార్ధి. ఉప్పల్ పీఎస్ పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్ధి ఆదిభట్లలో శవమై కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు నచ్చిన సెల్‌ఫోన్ మిత్రుడు ప్రేమ్ కుమార్ వద్ద ఉందని గ్రహించిన సాగర్ అనే యువకుడు దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధితో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు కథనం ప్రకారం రామంతాపూర్‌కు చెందిన ప్రేమ్ కుమార్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాగా ప్రేమ్ కుమార్ వద్ద తనకు నచ్చిన ఖరీదైన సెల్‌ఫోన్ ఉందని గ్రహించిన సాగర్ అనే అతని స్నేహితుడు దానిపై కన్నేశాడు. ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని ప్రేమ్ కుమార్ హత్యకు ప్లాన్ చేశాడు. గత శుక్రవారం (జూలై 13) లాంగ్ డ్రైవ్‌కు వెళ్దాం రమ్మంటూ ప్రేమ్‌ను తీసుకుని తనతో తీసుకువెళ్ళాడు సాగర్.
రాత్రయినప్పటికీ తమ కుమారుడు ప్రేమ్‌కుమార్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తండ్రి ఉప్పల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తన స్నేహితుడు సాగర్ అనే యువకుడితో ప్రేమ్ కుమార్ వెళ్ళినట్టు నిర్థారణకు వచ్చారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు.
ప్రేమకుమార్ ను ఆదిభట్ల ప్రాంతం వద్ద హత్య చేసి మృతదేహన్ని కాల్చివేసినట్లుగా సాగర్ ఒప్పుకున్నాడు..నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు.. ప్రేమకుమార్ మృతదేహన్ని గుర్తించారు. ప్రేమ కుమార్ మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోర్టుమార్టుం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మొబైల్ మోజులో జరిగిన ఆ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్న ఆశ పెద్ద ప్రాణాన్ని తీసింది కదూ. పిల్లల్లో మితిమీరిన మొబైల్ కోరిన ఎంతటి అఘాయిత్యానికి దారితీస్తుందనడానికి ఇదోక మంచి ఉదాహరణ. పిల్లల చర్యలపై తల్లిదండ్రులు ఓ కన్ను వేసి ఉంచాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు..