AARAA Survey: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. పార్టీల మధ్య సవాళ్లు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని మూడు పార్టీల బలాబలాలు, ఓటర్ల మూడ్‌పై ఆరా సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు అంటే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల బలాబలాలు, ఓటర్ల నాడి ఎలా ఉందనే అంశంపై 2021 నవంబర్ నుంచి 2022 జూలై వరకూ మూడు దశల్లో ఆరా సంస్థ సర్వే నిర్వహించింది. సర్వేలో అన్ని రకాల నియోజకవర్గాల ఓటర్ల మూడ్ తెలిసేట్టు..6-7 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, 3-4 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, అర్బన్ నియోజకవర్గాలు 10-11, రూరల్ నియోజకవర్గాలు 18-19 వాటిలో సర్వే నిర్వహించారు. 


టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఓట్ల శాతం ఇలా


2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్..ఆ తరువాత 4 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే..8 శాతం ఓట్లు కోల్పోయి 38.88 శాతం ఓట్లను పొందవచ్చని తెలుస్తోంది. 


ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు సాధించిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆ తరువాత అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు ఈ సర్వేలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే..4.72 శాతం ఓట్లను కోల్పోయి..23.71 శాతానికి పరిమితం కానుందని ఆరా సంస్థ వెల్లడించింది. 


ఇక బీజేపీ 2018 ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లు సాధించగా..2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19.65 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు నిర్వహించిన సర్వేలో 23.5 శాతం అధికంగా ఓట్లు సాధించి..మొత్తం 30.48 శాతం దక్కించుకోనుందని తెలిపింది. 


ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండగా..వరంగల్, ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. ఇక మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో త్రిముఖ పోటీ నెలకొందని ఆరా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండగా..8 నియోజకవర్గాల్లో 4వ స్థానంలో నిలిచింది. అంటే ఈ 24 నియోజకవర్గాల్లో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. 


ఓటర్ల మూడ్


అధికార టీఆర్ఎస్ పరిపాలన బాగుందని ఓటర్లు విశ్వసిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం రాష్ట్రంలో పెచ్చుమీరిందనే భావన ఎక్కువౌతోంది. ఫలితంగా పార్టీ ఓటు బ్యాంకు తగ్గుతోంది. పీసీసీ అధ్యక్షుడు మార్పు పార్టీలో, కార్యకర్తల్లో మార్పు తెచ్చినా..గత ఎన్నికల్లో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతోంది. ఇక అదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన విజయాలు, నరేంద్రమోదీ నాయకత్వం, దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం టీఆర్ఎస్ పార్టీని బీజేపీ నిలువరిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆరా తెలిపింది. 


Also read: Kadem project floods live updates: అన్ని గేట్లు ఎత్తేశాం.. ఇంకా ఏమి చేయలేం! కడెం ప్రాజెక్టుపై చేతులెత్తేసిన ఇరిగేషన్ అధికారులు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook