Abdullapurmet twin murder case: హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో వెలుగుచూసిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. వివాహతేర సంబంధమే యశంత్, జ్యోతిల హత్యకు కారణమని... జ్యోతి భర్త శ్రీనివాసరావే హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. శ్రీనివాసరావుతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీనివాసరావు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారాసిగూడకు చెందిన శ్రీనివాసరావు-జ్యోతి (30) లకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసరావు స్టీల్ సామాను వ్యాపారం చేస్తున్నాడు. ఇదే వారాసిగూడకు చెందిన ఎడ్ల యశ్వంత్ (22) అనే యువకుడితో జ్యోతికి కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. యశ్వంత్ తమ ఇంటికి వచ్చి వెళ్తున్న విషయం శ్రీనివాసరావుకు తెలిసింది. 


ఇటీవల ఓరోజు యశ్వంత్, జ్యోతి ఇంట్లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో శ్రీనివాసరావు గమనించాడు. అప్పటినుంచి ఆ ఇద్దరినీ చంపేయాలనే కసితో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 30) ఇంటి నుంచి బయటకెళ్తూ... రాత్రికి ఇంటికి రానని భార్య జ్యోతితో చెప్పాడు. ఇదే అదనుగా ప్రియుడితో గడిపేందుకు జ్యోతి యశ్వంత్‌ను పిలిపించుకుంది.


ఆ తర్వాత ఇద్దరు కలిసి బైక్‌పై వారాసిగూడ నుంచి బయలుదేరడం శ్రీనివాసరావు గమనించాడు. తనతో పాటు మరో ఇద్దరిని వెంటపెట్టుకుని యశ్వంత్-జ్యోతిలను 30కి.మీ వరకు వెంబడించాడు. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద బైక్ ఆపి ఉంచడాన్ని గమనించి... అక్కడే వారి కోసం గాలించారు. ఇద్దరూ ఓ చోట ఏకాంతంగా కనిపించడంతో శ్రీనివాసరావు మొదట బండరాయితో జ్యోతి తలపై బలంగా కొట్టాడు. ఆపై పదునైన ఆయుధంతో యశ్వంత్‌ను పొడిచాడు. అతని మర్మాంగాలను తీవ్రంగా గాయపరిచాడు. ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకుని.. శ్రీనివాసరావు గ్యాంగ్ అక్కడి నుంచి విజయవాడ వైపు పారిపోయారు. 


శ్రీనివాసరావును పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో దర్యాప్తు సాగించి శ్రీనివాసరావును పట్టుకోగలిగారు. విచారణలో శ్రీనివాసరావు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. 


Also Read: India Covid 19 Cases: మూడు వేలకు పైగా కొత్త కరోనా కేసులు.. భారీగానే మరణాలు!


Also Read: Govt Jobs Telangana 2022: ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారా? ఫేక్‌ వెబ్‌సైట్లతో జాగ్రత్త..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.