ABVP Bandh in Telangana 2023: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలకు ఏబీవీపీ బంద్‌ ప్రకటించింది. రాష్ట్ర వాప్తంగా అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు సమకూర్చాలని, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ కూమార్‌ బంద్‌కి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పాఠశాలలు  బంద్‌ను స్వాగతించాగా..కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేవని, గిరిజన ప్రాంతాల్లో స్టూడెట్స్‌ చదవలేని పరిస్థితని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఈవో, ఎంఈఓ పోస్టుల ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భర్తీ చేయాలని ఏబీవీపీ కోరారు. అంతేకాకుండా అధికంగా ఫీజు దోచుకుంటున్న ప్రైవేట్‌ పాఠశాలలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ కూమార్‌ సూచించారు.


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  


విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా సమస్యలను పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు పాఠశాలలకు బంద్‌కు ఏబీవీపీ బంద్‌కి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేలకు పై పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యక్రర్తలు కోరారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిరు పేద విద్యార్థుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పట్టనట్లు చేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ వెంటనే పుస్తకాలను అందించాలని కోరారు.


ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ విద్యా సంవత్సరం షెడ్యూల్‌నికి కూడా ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 12 నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇక చివరి పని దినం విషయానికొస్తే..వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24 వరకు ప్రభుత్వం షెడ్యూల్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండడం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు రకాల చర్యలు చెపడుతోంది. 


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook