Acb Raids: అతనో హెడ్ కానిస్టేబుల్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు హెడ్ కానిస్టేబుల్ ను అడ్డంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. అనంతరం అతని నివాసంలో సోదాలు చేశారు. ఇక్కడే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏసీబీ అధికారులు ఇళ్లలో తనిఖీలు చేస్తే నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమవుతుంటాయి. కాని హెడ్ కానిస్టేబుల్ నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు పెద్ద మొత్తంలో బుల్లెట్లు లభించాయి. వేములవాడలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాశ్ .. ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. తర్వాత అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. చంద్రప్రకాష్ నివాసంలో నాలుగన్నర లక్షల రూపాయల నగదుతో పాటు బుల్లెట్లు దొరికాయి.  40 వరకు 303 తూటాలు, ఒక 9 ఎంఎం రౌండు లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలను ఏసీబీ అధికారులు బయటికి చెప్పడం లేదు. బుల్లెట్లు దొరికిన విషయాన్ని చంద్రప్రకాష్ పని చేసే పోలీస్ స్టేషన్ కు ఏసీబీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్ నివాసంలో తుపాకీ తూటాలు దొరకడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.


హెడ్ కానిస్టేబుల్ చంద్రప్రకాష్ బుల్లెట్లను  ఎందుకు సేకరించుకున్నారన్న దానిపై ఏసీబీ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. బుల్లెట్లు డిపార్ట్‌మెంట్ సప్లై చేసినవా లేక అక్రమంగా ప్రైవేటగా సేకరించినవా అన్న కోణంలో వివరాలు రాబడుతున్నారు. పోలీస్ శాఖకు చెందిన తూటాలు అయితే స్టేషన్ లో ఉంచకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారన్నది ప్రశ్నగా మారింది. పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూంలో ఉండాల్సిన బుల్లెట్లను హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ తన  ఇంట్లో దాచిపెట్టే అవకాశం ఉండదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో బుల్లెట్లు దొరకడం  ఖాకీల్లో కలకలం సృష్టిస్తోంది. విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోనికి వస్తాయో..


Also Read: Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద విలయం..22 మంది మృతి, పలువురు గల్లంతు..!


Also Read:Vijay Devarakonda Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook