Kcr Farm House: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. రాష్ట్రంలో పొలిటికల్ హడావుడి నడుస్తున్నా, టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్.. 18 రోజుల తర్వాత ప్రజలకు కనిపించబోతున్నారు. ఫాంహౌజ్ నుంచి ప్రగతి భవన్ వచ్చారు కేసీఆర్. ఏప్రిల్ 29న చివరి సారిగా ప్రజలకు కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అంతకుముందు ఏప్రిల్ 27న మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లినరీలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో ప్రసంగించారు. ఏప్రిల్ 29 ఇఫ్తార్ విందు తర్వాత ఎర్రబెల్లిలోని తన ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. 18 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇవాళ తిరిగి ప్రగతి భవన్ వచ్చారు కేసీఆర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విపక్షాలు దూకుడుగా జనంలోకి వెళుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేశారు. పాదయాత్రలో కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. ఇక సంజయ్ యాత్రలో భాగంగా పాలమూరు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. తుక్కుగూడలో జరిగిన ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. ఇద్దరు జాతీయ నేతలు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నిజాంను మించిన నియంతతో పోల్చారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ ను తరిమికొట్టడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ పై అమిత్ షా చేసిన కామెంట్లపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేటీఆర్ సహా మంత్రులంతా ధీటుగా కౌంటరిచ్చారు. కాని కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు.


కాంగ్రెస్ కూడా జోరుగా జనంలోకి వెళుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు.  మే6న వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. మరుసటి రోజు హైదరాబాద్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో మాట్లాడారు. తన ప్రసంగాల్లో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు రాహుల్. కేసీఆర్ పేరు ఎత్తకుండానే దారుణమైన విమర్శలు చేశారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ ను అభివర్ణించారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపిచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా దుమ్ము దులిపేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుతో టీఆర్ఎస్ లో కలవరం కల్గుతోంది.


రాజకీయంగా ఇంత హడావుడి సాగుతున్నా కేసీఆర్ సైలెంట్ గానే ఉండటం టీఆర్ఎస్ పార్టీ నేతలకు అర్ధం కాకుండా పోయింది. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. ఫాంహౌజ్ లో ఏం చేస్తున్నారన్నది ఎవరికీ అంతుపట్టలేదు. అయితే 18 రోజుల తర్వాత ఫాంహౌజ్ నుంచి కేసీఆర్ ప్రగతి భవన్ రావడంతో.. ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. తనపై రాహుల్ గాంధీ, అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇవాళో రేపో ఆయన ప్రెస్ మీట్ పెడతారని అంటున్నారు. కేసీఆర్ ఇప్పట్లో మీడియాకు ముందుకు రాకపోవచ్చనే మరో టాక్ కూడా వస్తోంది. ఈనెల18న కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశం కాబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చేసిన సర్వే వివరాలను సీఎంకు అందించబోతున్నారు. ఇందుకోసమే కేసీఆర్ ప్రగతి భవన్ వచ్చారంటున్నారు. పీకే టీమ్ నివేదికపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతారని అంటున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు తర్వాతే.. తాజా రాజకీయాలపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


READ ALSO: Ysr Rythu Bharosa: చంద్రబాబులా మోసం చేయను.. చెప్పింది చేసి తీరుతా! రైతు భరోసా సభలో సీఎం జగన్..


READ ALSO: Gautam Adani Rajyasabha: జగన్ కు భయపడే రాజ్యసభ సీటు వద్దన్నారా! అదానీ ప్రకటనపై ఏపీలో రాజకీయ రచ్చ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook