NIMS Hosptial: గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థ నాశనమైందని.. పిల్లల పరిస్థితి దారుణంగా మారిందని వాపోయారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో దాదాపు యాభై మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుందని వివరించారు. వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యా, సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: KTR vs Revanth: మళ్లీ రేవంత్‌ రెడ్డికి రాజకీయ జీవితం లేకుండా చేస్తాం: కేటీఆర్‌ హెచ్చరిక


 


ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు చికిత్స పొందుతున్న విద్యార్థి శైలజను శనివారం ఎమ్మెల్సీ కె కవిత పరామర్శించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించి.. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్‌ రెడ్డి వైఫల్యాలను వివరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇది చదవండి: KTR Election Results: చాపర్లు.. బ్యాగులు మోసినా ఘోర వైఫల్యం.. ఇకనైనా రేవంత్‌ రెడ్డి పద్ధతి మార్చుకో


 


కలుషిత ఆహారం తిని  మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న విద్యార్థిని కోలుకోకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సంక్షేమ శాఖలను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విద్యార్థుల మరణాలపై దృష్టి సారించడం లేదంటూ ప్రశ్నించారు.


తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన వసతులు కల్పించారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో అధ్వానంగా తయారయ్యాయని చెప్పారు. నారాయణపేట పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపిన మరుసటి రోజే మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడంపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పాఠశాలలో చేరే వాళ్లని.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter